ఏప్రిల్ 30న యువీ కాన్సెప్ట్స్ `ఏక్ మినీ క‌థ‌`!

ఏప్రిల్ 30న యువీ కాన్సెప్ట్స్ `ఏక్ మినీ క‌థ‌`!
ఏప్రిల్ 30న యువీ కాన్సెప్ట్స్ `ఏక్ మినీ క‌థ‌`!

న్యూ టాలెంట్‌ని ఎంక‌రేజ్ చేస్తూ కొత్త త‌ర‌హా చిత్రాల‌ని అందిస్తున్నారు యువీ క్రియేష‌న్స్‌. భారీ పాన్ ఇండియా మూవీస్‌ని అంద‌స్తూ వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటున్న యువీ సంస్థ తాజాగా న్యూ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న `ఏక్ మినీ క‌థ‌` చిత్రాన్ని నిర్మిస్తోంది. దివంగ‌త ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడు సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తున్నారు. కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీలో కావ్య తాప‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఓ విభిన్న‌మైన క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. `సైజు మేటర్` అనే ఉప‌శీర్షిక‌తో స‌రికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీని కార్తీక్ రాపోలు తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, అండ్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. `పేప‌ర్ బాయ్‌` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ శోభ‌న్‌కిది రెండ‌వ సినిమా.

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి క‌థ అందించారు. ర‌వీంద‌ర్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి ఫొటోగ్ర‌ఫీ గోకుల్ భార‌తి, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించారు. స‌త్య ఎడిటింగ్ అందించిన ఈ చిత్రంలో బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.