నిన్న `వి`.. ఇప్పుడు `వ‌కీల్ సాబ్‌`

నిన్న `వి`.. ఇప్పుడు `వ‌కీల్ సాబ్‌`
నిన్న `వి`.. ఇప్పుడు `వ‌కీల్ సాబ్‌`

దిల్ రాజు 25 ఏళ్ల డ్రీమ్ ఇటీవ‌ల `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ఫ‌లించిన విష‌యం తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ మూవీ అక్క‌డ కూడా మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటోంది. ఇదిలా వుంటే దిల్ రాజ్ డ్రీమ్ ఏమోగానీ ఈ మూవీ వ‌ల్ల ఆయ‌నపై తాజాగా కేసు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తన అనుమ‌తి లేకుండా `వ‌కీల్ సాబ్‌` చిత్రంలోని ఓ స‌న్నివేశంలో త‌న ఫోన్ నంబ‌ర్‌ను వాడార‌ని సుధాక‌ర్ అనే వ్య‌క్తి సోమ‌వారం చిత్ర నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్ర‌యించారు.

త‌న ప్రైవ‌సీకి భంగం క‌లిగించార‌ని ఆరోపిస్తూ `వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణుపై సుధాక‌ర్ అనే వ్య‌క్తి కేసు న‌మోదు చేశారు. . తన అనుమతి తీసుకోకుండా మేకర్స్ తన ఫోన్ నంబర్‌ను సినిమాలో ఉపయోగించారని ఆరోపించిన సుధాకర్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశంలో అంజలి ఫొటోని కాల్ గర్ల్‌గా మార్ఫింగ్ చేసి ఆ ఫొటో కింది ఓ ఫోన్ నంబర్ ని ప్రదర్శించారు. అది సుధాకర్ అనే వ్య‌క్తి నంబ‌ర్‌. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి అతనికి చాలా కాల్స్ వస్తున్నాయ‌ట‌. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌న‌కు ఫోన్ చేసి రోజూ వేధిస్తున్నార‌ని సుధాక‌ర్ అనే వ్య‌క్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీంతో ఈ విష‌య‌న్ని సీరియ‌స్‌గా తీసుకున్న పంజా గుట్ట పోలీసులు దిల్ రాజు, శ్రీ‌రామ్ వేణుల‌పై కేసు న‌మోదు చేశారు. అనంత‌రం సుధాకర్ న్యాయవాది వారికి నోటీసులు పంపారు. వారి ప్రతిస్పందన కోసం సుధాక‌ర్ ఎదురుచూస్తున్నారు. ఈ త‌ర‌హాలో దిల్ రాజు విమర్శలు ఎదుర్కొనడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు మోడల్ అండ్  నటి సాక్షి మాలిక్ తన అనుమ‌తి లేకుండా త‌న ఫొటోల‌ని నానితో నిర్మించిన `వి` చిత్రంలో వాడార‌ని దిల్ రాజుపై ఫిర్యాదు చేసింది. దీని కార‌ణంగా ఈ చిత్రంలోని స‌న్నివేశాన్నిఅమెజాన్ ప్రైమ్ వీడియో నుండి తొలగించాల్సి వ‌చ్చింది. దిల్ రాజుపై ఇలా వ‌రుస‌గా రెండు సార్లు ఈ త‌ర‌హా కేసులు న‌మోదు కావ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.