డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో `వి` సునామీ ఖాయ‌మేనా?


V movie create stunami views on amazon prime
V movie create stunami views on amazon prime

నేచుర‌ల్ స్టార్ నాని తొలి సారి సైకో త‌ర‌హా నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర‌లో న‌టించిన చిత్రం `వి`. సుధీర్‌బాబు మ‌రో హీరోగా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సాఫ్ట్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తొలి సారి చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. దిల్ రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని న‌టించిన 25వ చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై నానితో పాటు ఆడియ‌న్స్ కూడా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన `వి` ట్రైల‌ర్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి మ్యాచ్ అయ్యేలా వుంది. అందుకే ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్ 11 మిలియ‌న్ వ్యూస్ దాటేసింది. మ‌రి కొన్ని గంట‌ల్లోనే నాని చిత్రాల్లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన ట్రైల‌ర్‌గా రికార్డుని సాధించ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 5న 200 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేస్తోంది. తొలి రోజు రికార్డు స్థాయి వ్యూస్ గ్యారెంటీ అనే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఆరు నెల‌ల కాలంలో చాలా చిత్రాలు ఓటీటీల్లో విడుద‌లైనా ఏ సినిమాపై ఈ స్థాయి అంచ‌నాలు లేవు. తొలి సారి భారీ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుండ‌టంతో అంద‌రి దృష్టి `వి` సినిమాపై ప‌డింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా తొలి రోజు డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో సాధించ‌బోయే వ్యూస్‌పై ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప్ర‌త్యేక దృష్టిని పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ఈ చిత్రం తొలి రోజు రికార్డు స్థాయిలో వ్యూస్‌ని న‌మోదు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అదే జ‌రిగేతే డిజిటిల్ వ‌ర‌ల్డ్‌లో `వి` స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డం ఖాయం అని చెబుతున్నారు.