నిజంగా ‘వి’ పవన్, మహేష్ కోసమేనా?

V movie first choice is Pawan Kalyan and Mahesh Babu
V movie first choice is Pawan Kalyan and Mahesh Babu

న్యాచురల్ స్టార్ నాని విలన్ గా, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా వి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పరిస్థితులు సాధారణంగా ఉంటే ఈ పాటికి వి ట్రైలర్ విడుదలై ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండేవి. నాని, సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, హీరోయిన్లు నివేతా థామస్, అదితి రావు హైదరి, దిల్ రాజు ఇలా టీమ్ మొత్తం ఇంటర్వ్యూలతో హోరెత్తించేసేవారు. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ లో విడుదల అన్నారు కానీ అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేకున్నారు. అయితే ఈ విషయం పక్కనపెట్టేస్తే ఇప్పుడు ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఇటీవలే సుధీర్ బాబు ఒక గేమ్ షో కు వెళ్లగా అక్కడ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఇంటర్వ్యూ చేసిన అలీ ఈ సినిమాకు మొదట నానినే అనుకున్నారా అని అడిగితే దానికి సుధీర్ బాబు చెప్పిన సమాధానం అందరికీ నిజంగా బాగుండును కదా అన్న ఫీలింగ్ కలిగించింది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు మొదట నాని, సుధీర్ బాబు కాకుండా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను దృష్టిలో ఉంచుకుని కథ రాసాడట. మరి ఏం జరిగిందో తెలీదు కానీ ఈ సినిమా నాని, సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళింది. అయితే ఈ ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే విడుదలైంది. ఫుల్ ఇంటర్వ్యూ 23న వస్తుంది. అది చూస్తే కానీ అసలు విషయం తెలియదు.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇప్పటివరకూ టాప్ రేంజ్ సినిమాలు చేయలేదు. సింపుల్ బట్ బ్యూటిఫుల్ సినిమాలనే చేస్తూ వచ్చాడు. తొలిసారి తన జోనర్ కానీ స్లీక్ యాక్షన్ థ్రిల్లర్ ను అటెంప్ట్ చేసాడు. మరి ఊహించుకోవడానికి సూపర్బ్ గా ఉంది కానీ పవన్, మహేష్ లను అసలు ఈ దర్శకుడు కలిశాడా? లేక కథ చెప్పకుండానే వర్కౌట్ కాదని నాని, సుధీర్ బాబులను తీసుకున్నాడా?