నాని ‘V’.. వచ్చేదెప్పుడంటే

నాని 'V'.. వచ్చేదెప్పుడంటే
నాని ‘V’.. వచ్చేదెప్పుడంటే

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని రెగ్యులర్ కథలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాడనే ఒక నెగిటివ్ కామెంట్ ఉంది. ఒకానొక సమయంలో డిఫరెంట్ సినిమాలు చేయమని రాజమౌళి కూడా నానికి డైరెక్ట్ గా సలహా ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగా నాని జెర్సీ అనే సినిమా చేశాడు. అలాగే గ్యాంగ్ లీడర్ తో కూడా కాస్త కొత్తగా ట్రై చేశాడనే టాక్ ను అందుకున్నాడు.

మొత్తానికి ఆ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటి కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా లాభాలని అందించలేకపోయాయి. ఇక నెక్స్ట్ కూడా నాని మళ్ళీ డిఫరెంట్ జానర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవాలని కష్టపడుతున్నాడు. ప్రస్తుతం నాని దిల్ రాజు ప్రొడక్షన్ లో ‘V’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.
ఇక సినిమాను వచ్చే ఏడాది ఉగాది ఫెస్టివల్ కి రిలీజ్ చేయాలనీ దిల్ రాజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అనుకున్న సమయానికి ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ పూర్తయితే 2020 మార్చ్ 25న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నెగిటివ్ షెడ్ లో కనిపించనున్నట్లు టాక్. ఇక ఒక ముఖ్య పాత్రలో హీరో సుధీర్ బాబు కనిపించబోతున్నాడు.

Credit: Twitter