మాస్ దర్శకుడు.. హీరో అయ్యాడు!


vv vinayak
vv vinayak

ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, అల్లుడు శ్రీను, ఖైదీ నం:150 …ఈ సినిమాలు గుర్తున్నాయా మీకు? మాస్ దర్శకులు “వి.వి. వినాయక్” గారి నుండి వచ్చిన సినిమాలు అవి. ఇప్పటికి ఆయా హీరోల కెరీర్ లో గుర్తుండిపోయే, మైలు రాయిగా నిలిచిపోయే సినిమాలు. అలా హీరోల కెరీర్ ని తీర్చిదిద్దిన దర్శకులు ఇప్పుడు తన కెరీర్ ని పరీక్షించుకుంటున్నారు.

అదేంటి ఆయన  సినిమాలకి దర్శకత్వం చేసిన సినిమాలు అఖిల్, ఇంటెలిజెంట్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కదా ఇప్పుడు ఇంకొక సినిమా ఏమన్న చేస్తున్నారా అని కంగారుపడకండి. ఇక్కడే మనం అవాక్కవ్వాల్సిన విషయం. వి.వి. వినాయక్ గారు నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, కానీ హీరో ఎవరోకాదు… మన వి.వి. వినాయక్ గారే తన తదుపరి సినిమాలో హీరో.

తన దర్శకత్వంలో కాదు, ఇంకొక దర్శకుడిని పరిచయం చేస్తూ, దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్నారు. ఈ సినిమా గురించి చాల రోజులుగా వినిపిస్తున్న మాటలే, కానీ నిన్న జరిగిన “సైరా” ఆడియో విడుదల కి అతిధిగా వచ్చి అందరికి తన కొత్త లుక్ తో షాక్ ఇచ్చారు.

ఇక మొన్న కూడా దిల్ రాజు గారు కూడా ఒక ప్రకటన ఇచ్చారు వి.వి. వినాయక్ గారితో నేను చేస్తున్న సినిమా ఈ ఏడాది చివరికి సెట్స్ మీదకి వెళ్తుంది అని..చూద్దాం మనం కూడా ఇప్పటివరకు హీరోల కెరీర్ ని మలిచిన మాస్ దర్శకులు వి.వి. వినాయక్ గారు తనని మాస్ లుక్ లో చూపిస్తాడో? లేక క్లాస్ లుక్ లో చూపిస్తాడో?