`ఉప్పెన‌` కూడా ఓటీటీ బాట ప‌ట్టేస్తోంది!


`ఉప్పెన‌` కూడా ఓటీటీ బాట ప‌ట్టేస్తోంది!
`ఉప్పెన‌` కూడా ఓటీటీ బాట ప‌ట్టేస్తోంది!

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఉప్పెన‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. క‌న్న‌డ బ్యూటీ క్రితిశెట్టి హీరోయిన్‌గా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌కి ముందే వైష్ణ‌వ్‌తేజ్ మ‌రో చిత్రాన్ని మెరుపు వేగంతో పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. హీరోయిన్ క్రితిశెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది.

ఇదిలా వుంటే సుకుమార్‌తో క‌లిసి మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించిన ఈ మూవీ గ‌త కొన్ని నెల‌లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. సాంగ్స్‌తో ఇప్ప‌టికే యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆడియ‌న్స్ కొత్త హీరో సినిమా కోసం థియేట‌ర్ల‌కు వ‌స్తార‌న్న గ్యారెంటీ లేదు. దీంతో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని మ‌న‌సు మార్చుకున్నార‌ట‌.

ఈ మూవీ డిజిట‌ల్ రిలీజ్ రైట్స్‌ని ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్‌కి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇచ్చేసిన‌ట్టు తెలిసింది. మైత్రీ మూవీస్ నిర్మించిన చిత్రాల డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్‌కి ఇస్తుంటారు. కానీ ఈ సారి అమెజాన్ వారు `ఉప్పెన‌`కు మ‌రీ త‌క్కువ మొత్తం ఇవ్వ‌డానికి ముందుకొచ్చార‌ట‌. అది న‌చ్చ‌ని మైత్రీ సంస్థ ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ని నెట్ ఫ్లిక్స్‌కి ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని తెలుస్తోంది.