`ఉప్పెన‌` కూడా ఓటీటీలోకి రాబోతోందా?


`ఉప్పెన‌` కూడా ఓటీటీలోకి రాబోతోందా?
`ఉప్పెన‌` కూడా ఓటీటీలోకి రాబోతోందా?

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం “ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్ తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌న్న‌డ హీరోయిన్‌ కృతి శెట్టి ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు అ మూవీతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

ఓ జాల‌రి ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందించారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ ప్రారంభం కావ‌డం, థియేట‌ర్లు మూసివేయ‌డంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. గ‌త ఏడు నెల‌లుగా థియేట‌ర్లు రీఓపెన్ కాక‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది.

చిత్ర బృందం మాత్రం అలాంటిది ఏమీ లేద‌ని చెబుతూ వ‌చ్చింది. కానీ తాజాగా థియేట‌ర్లు రీఓపెన్ అయినా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు గ‌తంలోలా వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్నిఓటీటీలోనే రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది. జీ5 ఇప్ప‌టికే భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని మేక‌ర్స్ ఆ ఆఫ‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.