వైష్ణ‌వ్‌తేజ్ `ఉప్పెన‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

వైష్ణ‌వ్‌తేజ్ `ఉప్పెన‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!
వైష్ణ‌వ్‌తేజ్ `ఉప్పెన‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

మెగా మేన‌ల్లుడు, హీరో సాయితేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన‌ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌, సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌న్న‌డ సోయ‌గం కృతిశెట్టి ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.

ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపు ప‌ది నెల‌లుగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ చిత్ర బృందం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ని బుధ‌వారం విడుద‌ల చేసింది. ఆద్యంతం ఆక‌ట్టుకునేలా టీజ‌ర్ సాగింది.

దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన పాట‌లు ఇప్ప‌టికే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వ‌చ్చే నెల ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించింది. పాట‌తో ఇప్ప‌టికే సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీ రేపు థియేట‌ర్ల‌లో ఎలాంటి రికార్డులు తిర‌గ‌రాస్తుందో చూడాలి.