మొత్తానికి `ఉప్పెన‌` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

మొత్తానికి `ఉప్పెన‌` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!
మొత్తానికి `ఉప్పెన‌` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

పంజా వైష్ణ‌వ్ తేజ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందుతున్న చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. క‌న్న‌డ బ్యూటీ కృతిశెట్టి ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ రిలీజ్ మొత్తానికి ఫైన‌లైంది.

హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు.
ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పాట‌లు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ని సొంతం చేసుకుని సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించిన ఈ చిత్ర గీతాలు రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ ఆ రికార్డ్స్ ప‌రంప‌ర కొన‌సాగుతూనే వుంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టీజ‌ర్ మంచి రెస్పాన్స్ ల‌భించింది. ప్రేమికుల రోజుకి రెండు రోజులు ముందు థియేటర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీ రికార్డులు సృష్టించ‌డం ఖాయం. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి రాయ‌నం అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. స‌ముద్ర తీర గ్రామంలో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.