`ఉప్పెన‌` డేట్ ఫిక్స‌యిపోయింది!

Vaishnav Tej uppena rlease date confirmed
Vaishnav Tej uppena rlease date confirmed

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా `ప్ర‌తిరోజు పండగే` చిత్రంతో స‌క్సెస్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ స‌క్సెస్ ఇచ్చిన ఆనందంలో వున్న సాయిధ‌రమ్‌తేజ్ తాజాగా `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` సినిమా షూటింట్ తో బిజీ అయిపోయాడు. ఇదిలా వుంటే సాయిధ‌ర‌మ్‌తేజ త‌మ్ముడు మ‌రో మెగా హీరో వైష్ఫ‌వ్ తేజ్ `ఉప్పెన‌` సినిమాతో ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఓ జాల‌రి జీవితం నేప‌థ్యంలో రూపొందుతున్న విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసిన చిత్ర బృందం విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించింది.

స‌ముద్ర‌పు ల‌ల‌పై అరుస్తూ క‌నిపిస్తున్న వైష్ణ‌వ్ తేజ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. చిత్రీక‌రణ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని స‌మ్మర్‌లో ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం వెల్ల‌డించింది. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా కృతిశెట్టి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.