పరువు హత్యల నేపధ్యంలో “ఉప్పెన”.?పరువు హత్యల నేపధ్యంలో “ఉప్పెన”.?
పరువు హత్యల నేపధ్యంలో “ఉప్పెన”.?

మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు, మెగా హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ దగ్గర ఎన్నో సినిమాలకు రచయితగా & దర్శకత్వ శాఖలో కీలక భాద్యతలు నిర్వహించిన సానా బుచ్చిబాబు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. రైటర్ గా ఉండే ఇంటెన్సిటీ బుచ్చిసార్ బలం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ఈసినిమాలో మక్కల్ సెల్వన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

హీరోఇజానికి తనదైన నిర్వచనం ఇచ్చే సుకుమార్ శిష్యుడు కథను హ్యాండిల్ చేస్తూనే మెగా అభిమానుల అంచనాలకు తగ్గట్లు హీరోను ఎలా చూపిస్తాడు.? అనే అంచనాలతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ సినిమా నేపధ్యం పరువు హత్యల నేపధ్యంలో ఉంటుందని విశ్వసనీయ సమాచారం. గతంలో కూడా అనేకమంది కొత్త హీరోలు ఇలా ప్రేమ కథల ద్వారానే పరిచయం అయ్యారు. వారిలో అల్లు అర్జున్(గంగోత్రి), రామ్ (దేవదాసు) వంటి పెద్ద హీరోలు కూడా ఉన్నారు. ఇక మెగాస్టార్ కొడుకుగా ఆయన పై ఉండే హై లెవల్ అంచనాలను మ్యాచ్ చేస్తూ, రామ్ చరణ్ గారు కూడా చిరుత అనే లవ్ బేస్డ్ యాక్షన్ కథతోనే ఇండస్ట్రీకి ప్రవేశించారు. ఇక వారందరిలాగా వైష్ణవ తేజ్ కూడా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.