అతడ్ని సైరా నుండి తీసేసారట


vakada apparao out from sye raa narasimhareddy సీనియర్ నిర్మాత వాకాడ అప్పారావు పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేయడంతో అతడి వ్యవహారం గురించి ఇన్నాళ్లు మౌనం వహించిన వాళ్ళు సైతం బహిరంగంగా వాకాడ అప్పారావు చేసిన ఘోరమైన తప్పులను మెగా కుటుంబానికి తెలిసేలా చేయడంతో అతడ్ని సైరా …. నరసింహారెడ్డి బృందం నుండి తొలగించారట . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా ….. నరసింహారెడ్డి చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్థాయి లో ఉండి అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నాడు వాకాడ అప్పారావు .

అయితే అతడి పై ఘోరమైన ఆరోపణలు ఉన్నందున ఇప్పటికే పలువురు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసిన నేపథ్యంలో అతడ్ని ఇంకా మన దగ్గరే ఉంచుకుంటే మరింత మురికి అంటుకుంది అని భావించిన చిరంజీవి , చరణ్ లు వాకాడ ని వెళ్లిపొమ్మని చెప్పారట . దాంతో వాకాడ కన్నీరు మున్నీరు అవుతున్నాడు . కొన్ని చిత్రాలను నిర్మించిన వాకాడ సూపర్ గుడ్ లో కీలకంగా ఉన్నాడు . కట్ చేస్తే అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న అప్పారావు కు ఇపుడు పనిలేకుండా పోయింది .