బాల‌య్య సినిమా ఇప్ప‌టికీ వ‌ద‌ల‌నంటోందా?


బాల‌య్య సినిమా ఇప్ప‌టికీ వ‌ద‌ల‌నంటోందా?
బాల‌య్య సినిమా ఇప్ప‌టికీ వ‌ద‌ల‌నంటోందా?

తొంద‌ర పాటు నిర్ణ‌యాలు అదంగా సాగుతున్న జీవితాల్ని ఏవిధంగా అగాధాల్లోకి నెట్టేస్తాయో అంద‌రికి తెలిసిందే. అలాంటి నిర్ణ‌య‌మే ఓ నిర్మాత‌ని తేరుకోలేని క‌ష్టాల్లోకి నెట్టేసింది. స్టార్ హీరో డేట్స్ ఇస్తున్నారు క‌దా అని ముందూ వెన‌క ఆలోచిక తొంద‌ర‌ప‌డిన ఓ నిర్మాత ఇప్ప‌టికీ ఆ సినిమా నేర్పిన గుణ పాఠాల్ని అనుభ‌విస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. 2007లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం `మ‌హార‌థి`. `చంద్ర‌ముఖి` ఫేమ్ పి. వాసు ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హించారు.

అప్ప‌ట్లోనే భారీగా నిర్మించిన ఈ చిత్రంతో సూప‌ర్ గుడ్ ఫిలింస్‌కు చెందిన వాకాడ అప్పారావు సోలో నిర్మాత‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. అయితే ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ కావ‌డ‌మే కాకుండా నిర్మాత జీవితాన్ని చిక్కుల్లో ప‌డేసింది. త‌ల‌కు మించిన భారంగా మారింది. దీంతో ఈ సినిమా తెచ్చిపెట్టిన న‌ష్టాల‌ని పూడ్చ‌లేని స్థితికి చేరిపోయారు. ఫైనాన్షియ‌ర్‌ల వ‌ద్ద అప్పుతో పాటు బ్యాంకులోనూ 4 కోట్లు అప్పు చేసిన ఆయ‌న ఆ అప్పుని ఇప్ప‌టికీ క‌డుతూనే వున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ యూట్యూబ్ చాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. బాల‌య్య డేట్స్ దొరికాయ‌ని, క‌థపై కూడా దృష్టిపెట్ట‌కుండా సినిమా మొద‌లుపెట్టాన‌ని, ఫైనాన్షియ‌ర్ల స‌హాయంతో షూటింగ్ మొద‌లైంద‌ని, బ్యాంకులో 4 కోట్లు అప్పుతీసుకున్నాన‌ని, న‌ష్టాల కార‌ణంగా ఆ అప్పుని ఇప్ప‌టికీ క‌డుతున్నాన‌ని వాకాడ అప్పారావు వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.