`వ‌కీల్‌సాబ్` 9డేస్ వ‌ర‌ల్డ్ వైడ్‌ క‌లెక్ష‌న్స్!

`వ‌కీల్‌సాబ్` 9డేస్ వ‌ర‌ల్డ్ వైడ్‌ క‌లెక్ష‌న్స్!
`వ‌కీల్‌సాబ్` 9డేస్ వ‌ర‌ల్డ్ వైడ్‌ క‌లెక్ష‌న్స్!

బాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత న‌టించిన చిత్ర‌మిది. శ్రీ‌రామ్ వేణు డైరెక్ష‌న్‌లో బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లైన ఈ చిత్రం తొలి షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురినిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తొమ్మిది రోజుల్లో ఈ మూవీ 130.50 Cr గ్రాస్ వసూలు చేసింది. వైర‌స్ సెకండ్ వేవ్ మొద‌లైనా దాన్ని లెక్క‌చేయ‌కుండా ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కి వ‌స్తుండ‌టంతో ఈ మూవీ భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తోంది. 150 కోట్ల‌కు ప‌రుగుతీస్తోంది. అయితే కోవిడ్ ఉగ్ర‌రూపం దాల్చుతున్న నేప‌థ్యంలో వ‌చ్చేవారం నుంచి ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ కెపాసిటీని 100 శాతం నుంచి 50 శాతానికి త‌గ్గిస్తున్నారు. దీని వ‌ల్ల `వ‌కీల్ సాబ్` క‌లెక్ష‌న్‌ల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

వ‌కీల్ సాబ్ 9 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సాధించిన క‌లోక్ష‌న్‌ల విరాలు ఇలా వున్నాయి.

నైజాం : 23. 79 కోట్లు
సీడెడ్ : 12.32 కోట్లు
ఉత్త‌రాంధ్ర : 11.21 కోట్లు
ఈస్ట్ గోదావ‌రి : 6.09 కోట్లు
వెస్ట్ గోదావ‌రి :  6.61 కోట్లు
గుంటూరు : 6.79 కోట్లు
కృష్ణా   : 4.69 కోట్లు
నెల్లూరు  : 3. 22 కోట్లు
ఏపీ, తెలంగాణ టోట‌ల్ : 74.72 కోట్లు షేర్ (114.9 కోట్ల గ్రాస్ )
కర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా : 3.59 కోట్లు
ఓవ‌ర్సీస్ : 3.70 కోట్లు

`వ‌కీల్ సాబ్` 9 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ : 82.01 కోట్ల షేర్ ( 130.50 కోట్ల గ్రాస్‌)