ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్‌సాబ్` కామిక్ బుక్


ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్‌సాబ్` కామిక్ బుక్
ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్‌సాబ్` కామిక్ బుక్

పర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శృతిహాస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తోంది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండున్న‌రేళ్ల విరామం త‌రువాత ప‌‌వ‌న్‌కల్యాణ్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ ల‌భించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ ‌దీని ప‌రంప‌ర కొన‌సాగుతూనే వుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీ కోసం అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్, ఇటీవ‌ల విడుద‌లైన‌ టీజర్ అభిమానులను మంత్రముగ్దులను చేశాయి. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించి కొత్త త‌ర‌హా పోస్టర్లను రూపొందించి సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు.

వకీల్ సాబ్ కామిక్ బుక్ అంటూ ఓ అభిమాని నిఖిల్ అనుదీప్ చేసిన డిజైన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది. పోస్టర్ రంగులు, టైటిల్ ఫాంట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన
తమన్ ఈ పోస్టర్ చూసి ఆశ్చర్యపోయాడు. త‌న సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట సంద‌డి చేస్తోంది.