వకీల్ సాబ్ భామ ఆ విషయంలో కంట్రోల్ తప్పిందిట

వకీల్ సాబ్ భామ ఆ విషయంలో కంట్రోల్ తప్పిందిట
వకీల్ సాబ్ భామ ఆ విషయంలో కంట్రోల్ తప్పిందిట

మల్లేశం వంటి విభిన్నమైన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ. తన పెర్ఫార్మన్స్ కు మంచి పేరొచ్చింది కూడా. అయితే అనుకున్నంత ఫేమ్ రాలేదు. కానీ గత నెలలో విడుదలైన వకీల్ సాబ్ ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. అనన్య నాగళ్ళ ముగ్గురమ్మాయిలలో ఒకరిగా నటించినా కానీ తనకంటూ ఫేమ్ ను తెచ్చుకోగలిగింది.

వకీల్ సాబ్ లో అమాయకురాలైన తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన అనన్య, బయట మాత్రం గడుసరే. ఇటీవలే ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ ఆమెలోని గ్లామర్ సైడ్ ను బయటపెట్టాయి. పద్దతిగా చీర కట్టుకున్నా కానీ అనన్య గ్లామర్ ను తెలివిగా పండించింది.

చూడటానికి బక్కచిక్కినట్లు ఉండే అనన్య ఇప్పుడు కంట్రోల్ తప్పిందిట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్నో భయాలు ఉన్నాయి. బలంగా తినాలి అంటున్నారు. అందుకే నా డైట్ కంట్రోల్ తప్పింది. బాగా తింటున్నాను అని చెప్పింది.

వకీల్ సాబ్ తర్వాత ఆమెకు ఆఫర్లు బాగానే వస్తున్నాయట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానంటోంది.