`వ‌కీల్‌సాబ్‌` వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌!

`వ‌కీల్‌సాబ్‌` వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌!
`వ‌కీల్‌సాబ్‌` వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా ప‌వ‌న్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేసి శ్రీ‌రామ్ వేణు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లైన ఈ చిత్రం తొలి షో నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది.

దీంతో అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీపై, ప‌వర్ స్టార్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే భారీ ఓపెనింగ్స్‌ని రాబ‌ట్టిందీ చిత్రం. ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా తొలి రోజు 52.4 కోట్ల గ్రాస్‌ని వ‌సూలు చేసింది. ఆ వివ‌రాలివి.

ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

నైజాం : 8.75 కోట్లు‌
సీడెడ్ : 4.50 కోట్లు
ఉత్త‌రాంధ్ర : 3.85 కోట్లు (జీఎస్టీ – 37 ల‌క్ష‌లు)
ఈస్ట్ గోదావ‌రి : 3.10 కోట్లు (హైర్స్ 90 ల‌క్ష‌లు)
వెస్ట్ గోద‌వరి : 4.50 కోట్లు (హైర్స్, ఎంజీ – 3.41 కోట్లు)
గుంటూరు : 3.94 కోట్లు (హైర్స్ – 1.81 కోట్లు)
కృష్ణా : 1.90 కోట్లు (హైర్స్ ప్ల‌స్ జీఎస్టీ 34 ల‌క్ష‌లు)
నెల్లూరు : 1.70 కోట్లు ( హైర్స్ 41 కోట్లు)
ఏపీ, తెలంగాణ : 32.24 కోట్లు (44 కోట్లు గ్రాస్‌) (6 కోట్లు హైర్స్‌)
క‌ర్ణాట‌క , రెస్టాఫ్ ఇండియా : 1.82 కోట్లు
ఓవ‌ర్సీస్ : 2.40 కోట్లు
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ : 36.46 కోట్లు (52.4 కోట్ల గ్రాస్‌)