వకీల్ సాబ్ ఆరంభమే అదరగొడతాడట


వకీల్ సాబ్ ఆరంభమే అదరగొడతాడట
వకీల్ సాబ్ ఆరంభమే అదరగొడతాడట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ను ప్రకటించిన దగ్గరనుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. ఈ సినిమా పింక్ చిత్రానికి రీమేక్ అయినా కానీ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉండనున్నాయన్న సంకేతాలు అందడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. దానికి తోడు విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఆ తర్వాత వచ్చిన మగువా సాంగ్ వకీల్ సాబ్ అంచనాలను తారాస్థాయిలో నిలిపాయి. అన్నీ అనుకున్నట్లుగా సజావుగా జరిగి ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదల కూడా అయిపోయేది. వకీల్ సాబ్ ను మే 15న విడుదల చేయాలనీ భావించారు. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు వాయిదా పడిన విషయం తెల్సిందే.

వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. షూటింగ్ కు అనుమతి లభించిన వెంటనే వీలైనంత తొందర్లో మిగతా బ్యాలన్స్ పార్ట్ షూటింగ్ ను కొనసాగించాలని భావిస్తున్నారు. ఇంకా కోర్టు సీన్స్ బ్యాలన్స్ ఉండడంతో ముందుగా ఒక స్పెషల్ సెట్ వేసి దాన్ని పూర్తి చేస్తారు. ఇక ఈ సినిమాలో పవన్ ఎంట్రీ ఒక స్టైలిష్ ఫైట్ తో ఉంటుందని తెలుస్తోంది. అది కచ్చితంగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. మరి ఈ రేంజ్ లో అంచనాలు ఉంటే పవర్ స్టార్ వాటిని వకీల్ సాబ్ తో అందుకోగలడా?

వేణుశ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.