వకీల్ సాబ్ కూడా రిలీజ్ డేట్ ను చెప్పేసాడు

Vakeel Saab release date confirmed
Vakeel Saab release date confirmed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రిలీజ్ డేట్ రేసులోకి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాను రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ బ్రహ్మాండంగా విడుదల కానుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి తగినన్ని మార్పులు చేసాడు. అందులో ప్రధానమైంది పవన్ కళ్యాణ్ కు లవ్ ట్రాక్ జత చేయడం. శృతి హాసన్ ఈ సినిమాలో పవన్ కు జోడిగా నటించింది. అలాగే అంజలి, నివేతా థామస్, అనన్యలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. వకీల్ సాబ్ పై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి వకీల్ సాబ్ కు ఏ రేంజ్ లో ప్రేక్షకులు ఆదరిస్తారో.