థమన్ ఇచ్చిన హింట్ ఏ సినిమా గురించి?

థమన్ ఇచ్చిన హింట్ ఏ సినిమా గురించి?
థమన్ ఇచ్చిన హింట్ ఏ సినిమా గురించి?

ఎస్ ఎస్ థమన్ ప్రస్తుతంభీకరమైన ఫామ్ లో కొనసాగుతోన్న విషయం తెల్సిందే. వరసగా టాప్ హీరోలతో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు థమన్ పనిచేయగా పవన్ రాబోయే చిత్రం అయ్యప్పనుమ్ కోశియుము రీమేక్ కు కూడా థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే థమన్ ఫిబ్రవరి 14 అని ట్వీట్ చేసాడు. అంటే ఆ రోజు ఏదో అప్డేట్ వస్తోందని చెప్పినట్లే. ఇంతకీ అది ఏ సినిమా గురించి అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే అందరూ వకీల్ సాబ్ సెకండ్ సింగిల్ గురించే ఈ అప్డేట్ ను ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే వకీల్ సాబ్ నుండి విడుదలైన మగువా మగువా చిత్రం చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం నుండి మరో సింగిల్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అన్నది చూడాలి. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది.