టీజ‌ర్ కోసం యుద్ధం మొద‌లైంది!



టీజ‌ర్ కోసం యుద్ధం మొద‌లైంది!
టీజ‌ర్ కోసం యుద్ధం మొద‌లైంది!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ క‌పూర్‌తో క‌లిసి తొలి సారి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాపిడ్ స్పీడుతో ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని ముందు ప్లాన్ చేశారు. అనుకున్న‌ట్టే కీల‌క కోర్టు సీన్ ఘ‌ట్టాల‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో దాదాపుగా పూర్తి చేశారు.

మేజ‌ర్ పార్ట్ షూటింగ్ పూర్త‌యింది. మ‌రింత భాగం చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల్సి వుంది. ఈ లోపే క‌రోనా వైర‌స్ విజృంభించ‌డం, కేంద్రం లాక్‌డౌన్ విధించ‌డంతో ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌రువాత టీకా అందుబాటులోకి వ‌చ్చేంత వ‌ర‌కు షూటింగ్ చేసే ప‌రిస్థితి లేద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ప‌ష్టం చేఇన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే `వ‌కీల్ సాబ్‌` టీమ్ దాదాపు 5 నెల‌ల విరామం త‌రువాత మ‌ళ్లీ వ‌ర్క్ మోడ్‌లోకి వ‌చ్చేసింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్ని పునః ప్రారంభించేసింది. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌ర్‌స్టార్ పుట్టిన రోజు వుండ‌టంతో `వ‌కీల్ సాబ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్‌ని సిద్ధం ఏసే ప‌నిలో భాగంగా టీమ్ అంతా యుద్ధం చేస్తున్నారు. ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా `వ‌క‌ల్ సాబ్‌` టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు ఇందు కోసం ఇటీవ‌లే ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఆ ప్లాన్ అంతా మారిపోయింది. థియేట‌ర్ల రీ ఓపెన్ త‌రువాతే ఈ సినిమా రిలీజ్‌పై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని తాజా స‌మాచారం.