`వ‌కీల్‌సాబ్‌` టీజ‌ర్ :  ప‌వ‌ర్‌స్టార్ స్ట్రైక్స్ అగైన్

`వ‌కీల్‌సాబ్‌` టీజ‌ర్ :  ప‌వ‌ర్‌స్టార్ స్ట్రైక్స్ అగైన్
`వ‌కీల్‌సాబ్‌` టీజ‌ర్ :  ప‌వ‌ర్‌స్టార్ స్ట్రైక్స్ అగైన్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ దాదాపు మూడేళ్ల త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని ప‌వ‌ర్‌స్టార్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేసి తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ మూవీ టీజ‌ర్ కోసం మెగా అభిమానులు గ‌త కొన్న రోజులుగా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ మేక‌ర్స్ సంక్రాంతి సంద‌ర్భంగా టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. క్రీయాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ప‌వ‌న్ కొంత గ్యాప్ త‌రువాత ఈ మూవీతో సంద‌డి చేయ‌బోతున్నారు. మూడేళ్ల విరామం ఏర్ప‌డినా ప‌వ‌ర్‌స్టార్ గ్రాఫ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇందుకు టీజ‌ర్ సాధిస్తున్న రికార్డ్సే నిద‌ర్శ‌నం.

`పుస్త‌కాల‌ని క‌వ‌ర్ చేసిన క‌వ‌ర్‌ని ప‌వ‌న్ తొల‌గిస్తున్న వి‌జువ‌ల్స్‌తో టీజ‌ర్ మొద‌లైంది. అబ్జ‌క్ష‌న్ యువ‌రాన‌ర్‌.. కోర్టులో వాదించ‌డ‌మూ తెలుసు.. కోటు తీసి కొట్ట‌డ‌మూ తెలుసు.. అంటూ ప‌వ‌న్ చెబుతున్న డైలాగ్‌లు సినిమా ఏ రేంజ్‌లో వుండ‌బోతుందో స్ప‌ష్టం చేస్తున్నాయి. ఓవ‌రాల్‌గా టీజ‌ర్‌లోని షాట్స్‌.. డైలాగ్స్‌ని బ‌ట్టి ప‌వ‌ర్‌స్టార్ స్ట్రైక్స్ అగైన్ అంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్‌. ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ 7 మిలియ‌న్ వ్యూస్ దాటి రికార్డు వ్యూస్ దిశ‌గా ప‌య‌నిస్తోంది.