బ‌ర్త్‌డే గిఫ్ట్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్‌!

బ‌ర్త్‌డే గిఫ్ట్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్‌!
బ‌ర్త్‌డే గిఫ్ట్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెర‌పై క‌నిపిస్తే ఫ్యాన్స్‌కు పూన‌కాలే. ఆయ‌న వెండితెర‌పై మెరుపులు మెరిపించి దాదాపు రెండేళ్లు దాటుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌ళ్లీ `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్ ఆధారంగా ఈ చిత్రాన్ని దిల్ రాజుతో క‌లిసి బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు. `వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మేజ‌ర్ పోర్ష‌న్ షూటింగ్ పూర్త‌యింది. కొంత బ్యాలెన్స్ గా వుంది. ఇందులో ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. నుగురు యువ‌తుల‌కు జ‌రిగిన అన్యాయంపై గ‌ళ‌మెత్తే డైన‌మిక్ లాయ‌ర్‌గా ప‌వ‌న్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్  లుక్ పోస్ట‌ర్‌కు ఫ్యాన్స్ నుంచి విశేష‌మైన స్పంద‌న ల‌భించింది. అయితే టీజ‌ర్ ఎప్పుడా అని ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్ప‌టికే సోష‌ల్‌మీడియాలో #AdvanceHBDPawanKalyan  హ్యాష్ ట్యాగ్‌తో హంగామా మొద‌లుపెట్టారు. అంతే కాకుండా బ‌ర్త్‌డే రోజున `వ‌కీల్ సాబ్‌` టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని కోరుతూ ట్వీట్‌లు పెడుతున్నారు. ఆ ట్వీట్‌ల‌ని నిర్మాత దిల్ రాజుకు ట్యాగ్ చేస్తుండ‌టంతో ఫ్యాన్స్ `వ‌కీల్ సాబ్‌` టీజ‌ర్ కోసం హంగామా ఏరేంజ్‌లో చేస్తున్నారో వైర‌ల్ అవుతోంది.