వకీల్ సాబ్ వాయిదా పడనుందా?


వకీల్ సాబ్ వాయిదా పడనుందా?
వకీల్ సాబ్ వాయిదా పడనుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ హిట్ సినిమా పింక్ ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి వకీల్ సాబ్ అనే పేరుని కన్ఫర్మ్ చేసిన విషయం కూడా తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల బ్రేక్ పడిన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 21 నుండి మొదలుకావాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే ఆ రోజు నుండి షూటింగ్ చేయడం దాదాపు కుదరని పని. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలుపెడితే చిత్రాన్ని రిలీజ్ టైమ్ కు సిద్ధం చేయడం చాలా కష్టం. వకీల్ సాబ్ కు చాలా టైట్ షెడ్యూల్స్ వేశారు. ఇప్పుడు దాదాపుగా 10 రోజుల వర్కింగ్ డేస్ పోవడంతో మళ్ళీ ఆర్టిస్ట్ ల డేట్స్ అడ్జస్ట్ చేసి షూటింగ్ మొదలుపెట్టాలంటే మరికొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ ను వాయిదా వేయక తప్పని పరిస్థితి తలెత్తే అవకాశముంది.

వకీల్ సాబ్ ను మే 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ తో షూటింగ్ మొత్తాన్ని అవగొట్టేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా మొత్తం తలక్రిందులైంది. ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. షూటింగ్ మొదలయ్యే దాన్ని బట్టి జులై లేదా ఆగస్ట్ లో వకీల్ సాబ్ విడుదల కావొచ్చు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. అంజలి, నివేతా థామస్, అనన్యలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ రోల్ కూడా ఉంది. అయితే ఇంకా ఆ పాత్రకు ఏ నటినీ ఎంపిక చేయలేదు. ఈ గ్యాప్ లో ఆ పనిలోనే ఉంది చిత్ర యూనిట్. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు.