మెగాస్టార్ అనుకున్న డేట్ కు పవర్ స్టార్ రాక


మెగాస్టార్ అనుకున్న డేట్ కు పవర్ స్టార్ రాక
మెగాస్టార్ అనుకున్న డేట్ కు పవర్ స్టార్ రాక

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి అన్నది ఏ మాత్రం క్లారిటీ లేని పరిస్థితి. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ఉంది కానీ వెంటనే కచ్చితంగా షూటింగ్ లు మొదలవ్వవు. ప్రభుత్వాలు పెర్మిషన్ లు ఇవ్వడానికి మరింత సమయం పడుతుంది. ఇప్పటికే దాదాపు 20 రోజుల నుండి టాలీవుడ్ లో షూటింగ్ లు జరగట్లేదు. మరో నెల రోజులు ఉండే పరిస్థితులు లేవు. దీంతో సినిమా రిలీజ్ లకు వివిధ సినిమాలు వేసుకున్న ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. ప్రతీ సినిమా రిలీజ్ డేట్ ను కనీసం రెండు నెలలకు పైగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ప్రకటించిన రిలీజ్ డేట్ లు అన్నీ తారుమారవనున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ చిత్రమైన వకీల్ సాబ్ ను మే లో విడుదల చేద్దామనుకున్నాడు. దీనికోసమే వకీల్ సాబ్ షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తూ వెళుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఇక మే లో విడుదల కావడమన్నది అసాధ్యం. దీంతో ఈ చిత్ర నిర్మాతైన దిల్ రాజు వేరే అనుకూల రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఆగష్టు 14న విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ డేట్ కు మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా ఆచార్యను విడుదల చేద్దామనుకున్నారు. దాని ప్రకారమే షెడ్యూల్స్ వేసుకున్నారు. అయితే వకీల్ సాబ్ కు వచ్చిన ఇబ్బందే ఆచార్యకు వచ్చింది. ఆగష్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడమన్నది అస్సలు జరగదు. ఇయర్ ఎండ్ కు మారిపోతుంది. కాబట్టి ఆ ఖాళీ అయిన డేట్ పై దిల్ రాజు కర్చీఫ్ వేయాలనుకుంటున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.