ఒడిశాలో `వ‌కీల్ సాబ్‌` థియేట‌ర్లు సీజ్‌!

Vakeel saab two theatres sealed in odisha
Vakeel saab two theatres sealed in odisha

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ న‌టించిన చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. మూడేళ్ల విరామం తరువాత ప‌వ‌ర్‌స్టార్ న‌టించిన చిత్రం కావ‌డంతో ఈ మూవీపై స‌హ‌జంగానే అంచ‌నాలు అంబ‌రాన్ని తాకాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా వుండ‌టంతో ప‌వ‌న్ అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు తెర‌కెక్కించారు.

బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ గ‌త శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. తొలి రోజు తొలి ఆట నుంచే ఈ మూవీ కోసం అభిమానులు ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌ల‌కు త‌ర‌లుతున్నారు. ప‌వ‌న్ మూడేళ్ల విరామం త‌రువాత చేసిన సినిమా కావ‌డంతో ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఈ సినిమా చూడాల‌నే ఉత్సుక‌త మొద‌లైంది. దీంతో ఏ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లు అధికంగా వున్న రాష్ట్రాల్లోనూ ఈ మూవీని ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్లు జ‌నాల‌తో కిక్కిరిసిపోతున్నాయి.

ఒడిశాలో ఈ మూవీ విడుద‌లైంది. భారీ స్థాయిలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌ల‌కు పోటెత్త‌డంతో కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని గ‌జ‌ప‌తి జిల్లాలోని ప‌ర్లాకిముడిలోని రెండు థియేట‌ర్ల‌ని అక్క‌డి అధికారులు సీజ్ చేశారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం రెండు థియేట‌ర్ల‌ని సీజ్ చేసిన అధికారులు కోవిడ్ సెకండ్ వేవ్ అదృతంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో నిబంధ‌న‌ల్ని త‌ప్ప‌కుండా పాటించాల‌ని అధికారులు ఈ సంద‌ర్భంగా సూచించారు.