ఎన్టీఆర్ తో గొడవ పై స్పందించిన డైరెక్టర్


vakkantham vamsi says no issues with ntrయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ భావించాడు రచయిత వక్కంతం వంశీ , టెంపర్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తనకు ఇవ్వడంతో ఇక వక్కంతం వంశీ ని దర్శకుడిగా పరిచయం చేయాలనీ అనుకున్నాడు ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ సినిమాతోనే వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కావాలి కానీ ఎన్టీఆర్ కోసం వక్కంతం వంశీ రెడీ చేసిన కథ నచ్చకపోవడంతో ఆ సినిమా పక్కకు పోయింది , ఆ సమయంలో వక్కంతం వంశీ కి ఎన్టీఆర్ కు మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి కట్ చేస్తే ఇన్నాళ్లకు వక్కంతం వంశీ స్పందించాడు . అసలు ఎన్టీఆర్ కు నాకు గొడవ జరగలేదు కేవలం అభిప్రాయబేధాలు మాత్రమే వచ్చాయని అంటున్నాడు .

ఎన్టీఆర్ కు కథ నచ్చకపోవడంతో నిరాశలో ఉన్న సమయంలో అల్లు అర్జున్ కోసం కథ ఉంటే చెప్పమని కోరారట బుజ్జి అనే నిర్మాత దాంతో నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే కథ చెప్పాడు , ఆ కథ అల్లు అర్జున్ కు నచ్చడంతో దర్శకుడిగా మారాడు . కట్ చేస్తే ఈరోజు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది దాంతో వక్కంతం వంశీ చాలా సంతోషంగా ఉన్నాడు . ఇపుడు ఛాన్స్ ఇస్తే ఎన్టీఆర్ కోసం మరో కథ ఇస్తానని అంటున్నాడు మరి ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి .