సస్పెన్స్ ఎలిమెంట్ కీలకంగా వలయం


సస్పెన్స్ ఎలిమెంట్ కీలకంగా వలయం
సస్పెన్స్ ఎలిమెంట్ కీలకంగా వలయం

లక్ష్ హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం వలయం. ఈ సినిమా ద్వారా రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయమవుతుండగా చదలవాడ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న వలయం విడుదలవుతుండగా ఈ చిత్రంలో సస్పెన్స్ మెయిన్ ఎలిమెంట్ గా ఉన్నట్లు హీరో మరియు నిర్మాత లక్ష్ తెలియజేసాడు.

ఈ చిత్రానికి ముందుగా దిశ అనే టైటిల్ పెడదామని అనుకున్నారట. దిశ ఇన్సిడెంట్ కు తమ సినిమాకు సంబంధం లేకపోయినా కానీ ఈ సినిమాకు టైటిల్ మార్చేసాం. దిశకు బదులు వలయం అనే టైటిల్ ను ఫిక్స్ చేసాం అని తెలిపాడు. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా మారిన లక్ష్ తన సినీ ప్రయాణం గురించి తెలియజేసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాలు చేసి, హీరోగా నాలుగు సినిమాలు చేసిన లక్ష్ ఇప్పుడు వలయం సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాడు.

అయితే హీరోగా మధ్యలో బ్రేక్ రావడం మళ్ళీ వలయం సినిమా చేయడంపై లక్ష్ స్పందించాడు. నాన్న గారి ప్రోత్సాహం వల్లే ఈ సినిమా చేయగలిగాను. దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు నచ్చింది. అయితే ఈ కథకు తగ్గ మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పాడు.