ఒక పక్క కేసు, కోర్ట్ లు – మరొక పక్క రిలీజ్ ఫంక్షన్


Valmiki
ఒక పక్క కేసు, కోర్ట్ లు – మరొక పక్క రిలీజ్ ఫంక్షన్

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, పేరుకి ఒక వైవిధ్యమైన దర్శకుడు, తన వైవిధ్యం తన మాటలలో ఉంటుంది, తను తీసే సినిమాలలో కూడా ఉంటుంది, మొదటగా “షాక్” అంటూ వచ్చాడు, అది నిరశాపరచడంలో మొదటి లిస్టు లో వున్న సినిమాగా పేరు పొందింది.తర్వాత వచ్చిన “మిరపకాయ్,గబ్బర్ సింగ్, డి.జే.” సినిమాలు చాలు తనలో ఉన్న వైవిధ్యం ఏంటో అర్ధం అయిపోవడానికి.

ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా “వాల్మీకి” వారం రోజుల తర్వాత రిలీజ్ కి సిద్ధంగా ఉంది, ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఏమో కాని, సినిమా పేరు అల పెట్టడంలో జరిగిన రచ్చ అంత ఇంత కాదు, ఈ సినిమా టీం మాత్రం మీరు పుకార్లని నమ్మోద్దు అని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు, ఆ రచ్చ కి కారణం అయిన వాళ్ళు కనిపించడం లేదు కాని వాళ్ళ పుకార్లు మాటలు వినిపిస్తున్నాయి తప్ప, ఇంకా మిగిలిన విషయాలు ఏమి అంతగా బయటికి రావడం లేదు, ఈ మధ్య “బోయ” వారు అని ఈ సినిమా విషయం టైటిల్ దగ్గర అభిప్రాయా బేధాలు ఉన్నాయి, సినిమా ని నిలిపివేయాలి అంటూ, మీడియా లో బాగా హడావిడి చేస్తున్నారు, పైగా కోర్ట్-కేసు అంటూ కూడా బాగా ప్రచారం చేస్తున్నారు, ఒక పక్క వాల్మీకి టీం మాత్రం వారానికి ఒక పాట రిలీజ్ చేస్తూ సినిమా గురించి ప్రేక్షకుడికి అంచానాలు పెంచేస్తున్నారు.

ఈ రోజు సినిమా ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించారు, ఈ నెల 15 వ తారీఖున సినిమా ఆడియో రిలీజ్ హైదరాబాద్ లో జరగనున్నది , దానికి గెస్ట్ మన విక్టరీ “వెంకటేష్ దగ్గుపాటి“గారు హాజరు అవుతారు అని ఒక పోస్ట్ రిలీజ్ చేసారు. ఒక పక్క సినిమా టైటిల్ విషయం కోర్ట్-కేసు అంటూ రోజు వార్తల్లో నిలుస్తుంటే, మరో పక్క సినిమా రిలీజ్ కి దగ్గర అవుతుంది. చూద్దాం ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో?

ముందుగా ఈ సినిమాకి ఎటువంటి గొడవ లేకుండా రిలీజ్ అయ్యి, సినిమా బాగా ప్రేక్షక ఆదరణ పొందాలి అని మన Tollywood.net తరపున ప్రత్యేక అభినందనలు.