మెగా ప్రిన్స్ పై భారీ భారం


Varun Tej
మెగా ప్రిన్స్ పై భారీ భారం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం వాల్మీకి. తమిళ్ బ్లాక్ బస్టర్ జిగర్తాండ చిత్ర రీమేక్ గా ఇది తెరకెక్కింది. అవ్వడానికి రీమేక్ అయినా తెలుగు వెర్షన్ లో బోలెడన్ని మార్పులు చేసాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక్కడ మన అభిరుచులకు తగ్గట్లుగా ఎంటర్టైన్మెంట్ అంశాన్ని పెంచాడు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది.

వాల్మీకి చిత్రానికి సెల్లింగ్ పాయింట్ కథ కన్నా ముందు వరుణ్ తేజ్ అని చెప్పాలి. వరుణ్ పేరుతోనే ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగా జరిగింది. వాల్మీకి థియేట్రికల్ బిజినెస్ 24.25 కోట్ల రూపాయిలు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దగ్గరగా 20 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. అంటే వాల్మీకి సినిమా హిట్ అవ్వాలంటే పాతిక కోట్ల షేర్ రావాలి. పాతిక కోట్లు అంటే అదేమీ తక్కువ అమౌంట్ కాదు. మొదటి రోజు టాక్ అద్భుతంగా రావాలి. అలాగే మొదటి వీకెండ్ కే దాదాపు 20 కోట్ల షేర్ రావాలి. వరుణ్ తేజ్ ఇంత భారాన్ని మోయగలడా?