వాల్మీకి కాదు గద్దలకొండ గణేష్


Valmiki title changed to Gaddala Konda Ganesh
Valmiki title changed to Gaddala Konda Ganesh

దురదృష్టవశాత్తూ వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్మీకి చిత్ర టైటిల్ ను మారుస్తూ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. బోయ వాల్మీకి కమ్యూనిటీ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంలో అనంతపూర్, కర్నూల్ జిల్లా అధికారులు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించారు.

రేపు ఉదయం రిలీజ్ అనగా రాత్రికి రాత్రి ఏం చేయాలో తెలీని నిర్మాతలు, దర్శకుడు వాల్మీకి టైటిల్ ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరుణ్ తేజ్ పాత్ర పేరైన గద్దలకొండ గణేష్ నే సినిమా టైటిల్ గా ప్రకటించారు. ఒకసారి సెన్సార్ అయిన సినిమాకి మళ్ళీ రిలీజ్ ముందర ఇబ్బందులు ఎదురుకావడం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి.
చిత్ర ఫలితంపై ఈ టైటిల్ మార్పు ఎటువంటి ప్రభావం చూపదనే ఆశిద్దాం. గద్దలకొండ గణేష్ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. తమిళ్ సూపర్ హిట్ జిగర్తాండ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది గద్దలకొండ గణేష్.