మహేష్ స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించాడా?


మహేష్ స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించాడా?
మహేష్ స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించాడా?

మహేష్ బాబుతో మహర్షి సినిమా చేయడం కోసం దాదాపు 2 ఏళ్ళు వెయిట్ చేసాడు వంశీ పైడిపల్లి. దానికే ఫిదా అయిపోయిన మహేష్ బాబు తనకు మహర్షి వంటి మంచి హిట్ ఇవ్వడంతో ఇక ఫ్యామిలీ మెంబర్ లానే చూసుకున్నాడు. తర్వాతి సినిమా సరిలేరు నీకెవ్వరు చేసినా ఆ తర్వాతి సినిమాను మళ్ళీ వంశీ పైడిపల్లికే చేయాలని ఫిక్స్ అయ్యాడు. తనకోసం అంత కాలం వెయిట్ చేసి అంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి ఆ మాత్రం చేయలేనా అని భావించాడు. మహేష్ తో వరసగా రెండో సినిమా ఛాన్స్ వచ్చేసరికి వంశీ పైడిపల్లి మరింత ఉత్సాహంతో తన తర్వాతి సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. స్క్రిప్ట్ వర్క్ లేట్ అవుతుండడంతో మహేష్ కూడా రెండు, మూడు నెలలు వెయిట్ చేయడానికి సిద్ధపడ్డాడు.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు మహేష్ బాబు – వంశీ పైడిపల్లి సినిమా లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అటు మహేష్ వర్గం నుండి కానీ ఇటు దర్శకుడు కానీ ఈ వార్తలపై స్పందించకపోవడంతో అవి నిజమేనన్న భావనకు వచ్చేసారు చాలా మంది. వంశీ పైడిపల్లి స్థానంలో మహేష్ చేయబోయే సినిమా ఇదేనంటూ రూమర్ల మీద రూమర్లు పుట్టుకోస్తున్నాయి. అయినా మహేష్ తదుపరి సినిమా విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు.

ఇక తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమా సెట్ అవ్వలేదని, ఇప్పుడు మరో హీరో కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యాడన్న గాసిప్స్ మొదలయ్యాయి. వంశీ రెబెల్ స్టార్ ప్రభాస్ కు మహేష్ కోసం సిద్ధం చేసిన కథ వినిపించగా ఇంప్రెస్ అయ్యాడని సమాచారం. కచ్చితంగా సినిమా చేస్తానని కాకపోతే మొదలవ్వడానికి ఏడాది చివరి వరకూ వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. దానికి వంశీ కూడా ఎస్ అన్నట్లు సమాచారం. చూస్తుంటే మున్నా కాంబో మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది.