మహేష్ కు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్


Mahesh Babu
మహేష్ కు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మైల్ స్టోన్ ఫిల్మ్ మహర్షి సినిమాను విజయవంతం చేసాడు వంశీ పైడిపల్లి. ఈ చిత్రం అన్ని వర్గాల వారి నుండి ప్రశంసలు అందుకుంది. వంశీ వర్క్ తో పూర్తిగా ఇంప్రెస్ అయిన మహేష్, వెంటనే తనతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. నవంబర్ చివరిదాకా బాబు ఫ్రీ అయ్యే ఛాన్సులు లేవు.

మరోవైపు మహేష్ తర్వాతి చిత్రం గురించి రోజురోజుకీ ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. వంశీ పైడిపల్లితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా క్లారిటీగా ఏ విషయం తెలీదు. తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ఇప్పటికే మహేష్ కోసం ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ కు చెందిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుదిదశకు చేరుకుంటున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహేష్ తర్వాతి చిత్రం వంశీ పైడిపల్లితోనే ఉండొచ్చు.