చిరంజీవి -అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో


Vamsi paidipalli planning to set multistarer with chiranjeevi and allu arjun

మెగాస్టార్ చిరంజీవి , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది . సాలిడ్ హిట్స్ కొట్టలేదు కానీ విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది . ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్న ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు కానీ 2020 తర్వాతే ఆ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది . ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీ గా ఉన్నాడు . దాని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు .

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ఖాళీ , కానీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . ఇంకా ఆ సినిమా ప్రారంభమే కాలేదు కాబట్టి కంప్లీట్ కావాలంటే 2019 జూన్ తర్వాతే ! అంటే అప్పటికి చిరంజీవి కూడా కొరటాల శివ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉంటాడు కాబట్టి 2020 లోనే వంశీ పైడిపల్లి సినిమా ఉండొచ్చు . ప్రస్తుతం వంశీ పైడిపల్లి మహేష్ బాబు తో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు . త్వరలోనే ఆ సినిమా కంప్లీట్ కానుంది . అది పూర్తయ్యాక ఈ మల్టీస్టారర్ సినిమా గురించి ఆలోచించనున్నాడు .

English Title: Vamsi paidipally planning to set multi starrer with chiranjeevi and allu arjun