వెబ్ సిరీస్‌కి మ‌హేష్ డైరెక్ట‌ర్ రెడీ?


వెబ్ సిరీస్‌కి మ‌హేష్ డైరెక్ట‌ర్ రెడీ?
వెబ్ సిరీస్‌కి మ‌హేష్ డైరెక్ట‌ర్ రెడీ?

మ‌హేష్‌తో `మ‌హ‌ర్షి` వంటి బ్లాక్ బస్ట‌ర్ హిట్‌ని అందించారు వంశీ పైడిప‌ల్లి. ఆ త‌రువాత మ‌రోసారి ఇద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల్ని మ‌హేష్ కూడా దృవీక‌రించారు కూడా. కానీ వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ త‌న‌కి న‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌హేష్ మ‌రో ద‌ర్శ‌కుడికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. అత‌నే ప‌ర‌శురామ్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `స‌ర్కారు వారి పాట‌` పేరుతో మే 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున లాంఛ‌నంగా మొద‌లైన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే మ‌హేష్‌తో సినిమా నిస్స‌వ‌డంతో వంశీ పైడిప‌ల్లి వెబ్ సిరీస్‌ల‌ని నిర్మించ‌డం ప్రారంభించినట్టు తెలిసింది. మైహోమ్ గ్రూప్‌తో క‌లిసి అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో తొలి తెలుగు ఓటీటీని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దీనికి కోసం వంశీ పైడి ప‌ల్లి వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌లే ఈ టీమ్‌తో అసోసియేట్ అయిన వంశీ పైడిప‌ల్లి `ఆహా` కోసం త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌ని కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ని లేటెస్ట్ న్యూస్‌.

మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు ఏ హీరో డేట్స్ ల‌భించే పరిస్థితి లేక‌పోవ‌డంతో వెబ్ సిరీస్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. ఇటీవ‌ల ఆహా కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కంటెంట్ క‌రెక్ష‌న్ టీమ్‌లో వంశీ పైడిప‌ల్లి కూడా చేరారు.