ఈ స్టార్ దర్శకుడు వెబ్ సిరీస్ అంటున్నాడే!

ఈ స్టార్ దర్శకుడు వెబ్ సిరీస్ అంటున్నాడే!
ఈ స్టార్ దర్శకుడు వెబ్ సిరీస్ అంటున్నాడే!

ప్రస్తుతం డిజిటల్ మీడియా విప్లవాన్ని సినిమా రంగం గుర్తించింది. వెబ్ సిరీస్, వెబ్ సినిమాలకు వస్తోన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా రంగంతో పాటు వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్నారు.

ఇప్పటికే కొంత మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఈ కోవలోకి రావడం మనం చూసాం. ఇప్పుడు ఇదే కోవలో స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి రానున్నాడని తెలుస్తోంది. మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు వంశీ. ఈ సినిమా తర్వాత మహేష్ తో మరో సినిమా చేయాల్సింది కానీ కుదర్లేదు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత రాజమౌళి సినిమా ఉంది. అది కనుక ఆలస్యమైతే వంశీతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ మీద వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనికి సంబంధించిన విశేషాలు తెలుస్తాయి.