సినీ రైట‌ర్‌ని బ‌లితీసుకున్న కరోనా

సినీ రైట‌ర్‌ని బ‌లితీసుకున్న కరోనా
సినీ రైట‌ర్‌ని బ‌లితీసుకున్న కరోనా

క‌రోనా మ‌హ‌మ్మారి స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా సినీ ఇండ‌స్ట్రీని వెంటాడుతోంది. బండ్ల గణేష్ నుంచి చిరంజీవి వ‌రకు దీని బారిన ప‌డి భ‌యాందోళ‌న‌కు గురైన వారే. ఇందులో కొం మంది చావుని ప‌ల‌క‌రించి తిరిగి వ‌చ్చారు. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి నెల‌రోజుల పాటు చికిత్స పొంది గాన గంధ‌ర్వుడు ఎస్పీబాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆకాల మ‌ర‌ణం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని క‌ల‌చివేసింది.

ఇండ‌స్ట్రీలో లైట్ బాయ్ ద‌గ్గ‌రి నుంచి స్టార్ డైరెక్ట‌ర్‌ల వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డుతూనే వున్నారు. రాజ‌మౌళి ఫ్యామిలీ క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల డా. రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. చాలా క్రిటిక‌ల్ స్టేజ్‌ని ఫేస్ చేసిన ఆయ‌న ఇటీవ‌లే సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఐదు రోజుల క్రితం త‌న‌కు క‌రోనా సోకింద‌ని ప్ర‌క‌టించిన చిరంజీవి తాజాగా ఆర్టీ పీసీఆర్ త‌ప్పిదం వ‌ల్లే త‌న‌కు క‌రోనా అని నిర్ధార‌ణ అయ్యింద‌ని, త‌న‌కు ఎలాంటి కరోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని ప్ర‌క‌టించ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా వుంటే తాజాగా యువ సినీ ర‌చ‌యిత‌ని క‌రోనా బ‌లితీసుకుంది. యువ ర‌చ‌యిత వంశీ రాజేష్ క‌రోనా బారిన ప‌డి మృతి చెందారు. చిన్న వయ‌సు అయినా క‌రోనా తీవ్ర‌త అధికంగా వుండ‌టం వ‌ల్లే వంశీ రాజేష్ మృతి చెందిన‌ట్టు తెలిసింది. దీంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు తీవ్ర దిగ్ధ్రాంతికి గుర‌వుతున్నారు. వంశీ రాజేష్ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` చిత్రానికి మాట‌లు అందించారు.