విశాల్ ని పెళ్ళి చేసుకోనంటున్న వరలక్ష్మి


Varalakshmi comments on marriage rumours

విశాల్ నాకు ఫ్రెండ్ మాత్రమే అతడ్ని నేను పెళ్ళి చేసుకోను అంతేకాదు అతడికి ఓ మంచి అమ్మాయిని చూస్తున్నాను పెళ్ళి చేయడానికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్ . విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్రంలో రాజకీయ నాయకురాలి పాత్రలో నటించింది ఈ భామ దాంతో ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఈ భామ ఆ చిత్ర విశేషాలతో పాటుగా విశాల్ గురించి , తమిళ రాజకీయాల గురించి మాట్లాడింది . విశాల్ ని త్వరగా పెళ్ళి చేసుకోమని కోరాను , ఇంకా ఆలస్యమైతే పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ పిల్లనివ్వరు . అందుకే నేనే అతడికి ఓ మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాను మీకు తెలిసిన వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటే చెప్పండి అని అంటోంది వరలక్ష్మి .

విశాల్ – నేను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ మి దాంతో పెళ్ళి పై పుకార్లు వస్తున్నాయని అవి నిజం కాదని అంటోంది . అంతేకాదు తమిళ రాజకీయాల్లోకి వస్తానని కాకపోతే అది ఇప్పుడే కాదని …….. నేను రాజకీయాల్లోకి వస్తానని అంటే మా నాన్న తన పార్టీలో చేరమని చెప్పాడని అందుకు నేను నో చెప్పానని కూడా చెబుతోంది వరలక్ష్మి శరత్ కుమార్ . నేను నటిని కాబట్టి అన్ని రకాల పాత్రలను పోషిస్తానని తెలుగులో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని అంటోంది . అయితే ఫ్రెండ్స్ అని చెప్పిన వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతూ అందరికీ షాక్ ఇస్తూ ఎప్పుడో అప్పడు పెళ్ళి చేసుకున్నాం అంటూ చెబుతారు మరి వీళ్ళు ఆ జాబితాలో ఉంటారా ? లేదో వచ్చే ఏడాది తేలిపోనుంది .

English Title: Varalakshmi comments on marriage rumours