మరింత నిప్పు రాజేస్తున్న వరలక్ష్మి


Varalakshmi sharath kumar comments on tamilanadu governemt

ఇప్పటికే సర్కార్ చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది , నిర్మాతలు ముందుకు వచ్చి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణుగుతోంది అనుకుంటే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత నిప్పు రాజేసేలా ఉన్నాయి . సర్కార్ చిత్రంలో కోమలవల్లి గా వరలక్ష్మి నటించిన విషయం తెలిసిందే . అయితే ఆ పాత్ర నెగెటివ్ షేడ్ లో ఉంటుంది అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకురాలు జయలలిత అసలు పేరు కోమలవల్లి దాంతో అన్నాడిఎంకే నాయకులు , కార్యకర్తలు పెద్ద గొడవ చేసారు . సర్కార్ ప్రదర్శిస్తున్న థియేటర్ ల వద్ద గందరగోళం సృష్టించడంతో చిత్ర నిర్మాతలు దిగొచ్చి చర్చలు జరిపి రాజీ మార్గాన్ని ఎంచుకున్నారు .

దాంతో సమస్య తీరిపోయింది అని అనుకుంటున్న సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళం సృష్టించేలా ఉన్నాయి . తమిళ సర్కార్ అంత బలహీనంగా ఉందా ? మీపై విమర్శనాత్మకంగా ఈ సినిమా ఉందని గోల చేయడం ద్వారా మీ స్థాయి మరింత దిగజారింది . అయినా సర్కార్ అంత బలహీనంగా ఉందా ? అంటూ నేరుగా తమిళ సర్కార్ ని ప్రశ్నిస్తోంది వరలక్ష్మి . ఈ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

English Title: Varalakshmi sarathkumar comments on tamil nadu government