ముద్దు ఒకడికి ఇస్తుందట పెళ్లి మాత్రం వేరేవాడితోనట


Varalaxmi angry on vishal
Varalaxmi Sarathkumar

నేను ముద్దు ఇవ్వాల్సి వస్తే తమిళ హీరో శింబు కి ఇస్తానని అయితే పెళ్లి చేసుకోవాల్సి వస్తే మాత్రం వేరే వాడ్ని చేసుకుంటానని ఇక చంపాల్సి వస్తే హీరో విశాల్ ని చంపేస్తా అంటూ కసిగా చెప్పింది డేరింగ్ అండ్ డాషింగ్  డైనమిక్ లేడీ వరలక్ష్మి శరత్ కుమార్ . తమిళ హీరో శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మి నటిగా తన  ప్రత్యేకతని చాటుకుంది . గ్లామర్ పాత్రలను మాత్రమే కాకుండా విభిన్నతరహా పాత్రలను పోషించిన వరలక్ష్మి   తాజాగా మారి 2 లో కూడా నటించింది .

అయితే ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న సందర్బంగా అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా చక చకా సమాధానాలు ఇచ్చేసింది . ముద్దు ఇవ్వాల్సి వస్తే …. శింబు కి ఇస్తానని , చంపాల్సి వస్తే విశాల్ ని చంపేస్తానని టక్కున చెప్పేసింది . హీరో విశాల్ – వరలక్ష్మి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అంతేకాదు ఇద్దరూ ప్రేమికులను తమిళనాడు మొత్తంగా  కోడై కూస్తున్నారు . కానీ వరలక్ష్మి మాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకంటే మేము ఆత్మ బంధువులం అని చెబుతోంది కానీ పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని అంటోంది .

English Title: Varalaxmi angry on vishal