టాలీవుడ్‌లో జ‌య‌మ్మ హ‌వా మొద‌లైంది!

varalaxmi sarathkumar hawa started in tollywood
varalaxmi sarathkumar hawa started in tollywood

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని క‌సిగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కోసం చేసిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై అనూహ్యంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ర‌వితేజ, గోపీచంద్ మ‌లినేని ల కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్‌ని సొంతం చేసుకున్నారు.

ఈ మూవీలో పోతురాజ్ వీర శంక‌ర్ పాత్ర‌లో న‌టించిన ర‌వితేజ‌కు ఎంత పేరొచ్చిందో క‌ఠారి కృష్ణగా స‌ముద్ర‌ఖ‌నితో పాటు జ‌య‌మ్మ‌గా న‌టించిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌కు అంతే పేరొచ్చింది. జ‌య‌మ్మ‌గా వ‌ర‌ల‌క్ష్మీ న‌టించిన తీరు, డ‌బ్బింగ్ చెప్పిన విధానం చాలా మందిని ఆక‌ట్టుకుంది. స్వ‌యంగా చిరంజీవి వ‌ర‌ల‌క్ష్మీని అభినందించ‌డం విశేషం. ఈ మూవీ త‌రువాత న‌రేష్ న‌టించిన `నాంది`లోనూ ముళ్ల‌పూడి ఆద్య‌గా న‌టించి ఆక‌ట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో టాలీవుడ్‌లో జ‌య‌మ్మ హ‌వా మొద‌లైంది.

నేడు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పుట్టిన రోజు. న‌ట‌న‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో న‌టిస్తూ న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న వ‌ర‌ల‌క్ష్మీ కోసం స్టార్ డైరెక్ట‌ర్‌లు ప్ర‌స్తుతం ఎదురుచూస్తున్నారు. ఆమె కోసం కీల‌క పాత్ర‌ల‌ని కొత్త‌గా త‌మ చిత్రాల్లో సృష్టిస్తున్నారు. కొర‌టాల శివ స్టార్ హీరో బ‌న్నీతో రూపొందించ‌నున్న చిత్రానికి వ‌ర‌ల‌క్ష్మీని ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ కోసం సంప్ర‌దించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.