ఈ రోజుతో జ‌య‌మ్మ షూటింగ్ కంప్లీట్‌!

ఈ రోజుతో జ‌య‌మ్మ షూటింగ్ కంప్లీట్‌!
ఈ రోజుతో జ‌య‌మ్మ షూటింగ్ కంప్లీట్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. `బ‌లుపు` మూవీ త‌రువాత గోపీచంద్ మ‌లినేని – ర‌వితేజ‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈ చిత్రాన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిస్తున్నారు.

శృతిహాస‌న్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో త‌మిళ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే హీరోయిన్ క్యారెక్ట‌ర్ మాత్రం కాదు. జ‌య‌మ్మ‌గా హై ఓల్టేజ్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మీ క‌నిపించ‌బోతోంది. గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. ర‌వితేజ పవ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ మూవీ కీల‌క షెడ్యూల్‌ తాజాగా పూర్త‌యింది.

జ‌య‌మ్మ‌గా వ‌ర‌ల‌క్ష్మీ షూటింగ్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. దీంతో వ‌రు సెట్లో సంద‌డి చేస్తూ ద‌ర్శ‌కుడితో క‌లిసి ఫొటోల‌కి పోజులిచ్చింది. ఈ విష‌యాన్న మేక‌ర్స్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీని సంక్రాంతి బ‌రిలో దించేస్తున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు కూడా చ‌క చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మీ – ర‌వితేజ‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌నున్నాయని తెలిసింది.