హీరో కూతురైనా మీటూ తిప్ప‌లు త‌ప్ప‌లేదు!


హీరో కూతురైనా మీటూ తిప్ప‌లు త‌ప్ప‌లేదు!
హీరో కూతురైనా మీటూ తిప్ప‌లు త‌ప్ప‌లేదు! ( Pic Credit: Instagram )

బాలీవుడ్ లో ఇటీవ‌ల మీటూ వివాదం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. త‌నుశ్రీ ద‌త్తా ఈ వివాదానికి మ‌రింత ఆజ్యం పోయ‌డంతో నానా ప‌టేక‌ర్ వంటి వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌లు, ద‌ర్శ‌కులు తాము చేస్తున్న సినిమాల నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. గ‌త వారం క్రితం ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య ఓ డ్యాన్స‌ర్‌ని లైంగిక వేధింపుల‌కు గురిచేశాడంటూ ముంబైలో కేసు బుక్ కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఇదిలా వుంటే త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ మీటూ వుంద‌ని, ఆ కార‌ణంగానే తాను హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయాన‌ని వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం కోలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తాను స్టార్ కిడ్‌ని అయినా మీటూని ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని ఒక ద‌శ‌లో త‌న‌కు అవ‌కాశాలు కూడా రాకుండా చేశార‌ని ఇటీవ‌ల ఓ టెలివిజ‌న్‌కి ఇచ్చిన ఇంట‌ర్వూలో వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న‌ని స‌హ‌క‌రించ‌మ‌ని చెబితే అందుకు తాను ఒప్పుకోలేద‌ని, ఆ కారంగా కొంత మంది త‌న‌కు అవ‌కాశాలు కూడా రాకుండా చేశార‌ని, అయితే తాను న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి వున్నాను కాబ‌ట్టే పంథా మార్చుకుని ఇప్ప‌టికే 25 చిత్రాల్ని పూర్తి చేశాన‌ని చెప్పుకొచ్చింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్.