వ‌ర‌ల‌క్ష్మీకి షాకిచ్చిన హ్యాక‌ర్స్‌!



వ‌ర‌ల‌క్ష్మీకి షాకిచ్చిన హ్యాక‌ర్స్‌!
వ‌ర‌ల‌క్ష్మీకి షాకిచ్చిన హ్యాక‌ర్స్‌!

ఇటీవ‌ల సెల‌బ్రిటీలకు సంబంధించిన సోష‌ల్ మీడియా అకౌంట్‌లు హ్యాకింగ్‌కి గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ నుంచి హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌ర‌కు హ్యాక‌ర్స్ కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ జాబితాలో శ‌ర‌త్ కుమార్ ముద్దుల కూతురు, వెర్స‌టైల్ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కూడా చేరింది.

`క్రాక్‌` చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్న వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ సోష‌ల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్‌కి గురైంది. ఇదే విష‌యాన్ని వ‌ర‌ల‌క్ష్మీ గురువారం వెల్ల‌డించింది. త‌నకు స‌బంధించిన ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లు హ్యాకింగ్ కు గుర‌య్యాయని తెలిపింది. హ్యాక్‌కు గురైన త‌న అకౌంట్‌ల నుంచి ఎలాంటి ట్వీట్‌లు  షేర్‌లు వెలువ‌డినా త‌న‌కు సంబంధం లేద‌ని, ఈ విష‌యంలో నెటిజ‌న్స్ అప్ప‌మ‌త్తంగా వుండాల‌ని సూచించింది.

హ్యాక్ కు గురైన త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ల‌ని తిరిగి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని వ‌ర‌ల‌క్ష్మి తెలిపింది. తెలుగులో ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మి రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. ఒక‌టి ర‌వితేజ న‌టిస్తున్న `క్రాక్‌`, మ‌రొక‌టి అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న `నాంది`. ఇందులో `క్రాక్‌` సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.