‌లాక్‌డౌన్ వేళ ర‌క్ష‌ణ లేదంటున్న వ‌ర‌ల‌క్ష్మి!‌లాక్‌డౌన్ వేళ ర‌క్ష‌ణ లేదంటున్న వ‌ర‌ల‌క్ష్మి!
‌లాక్‌డౌన్ వేళ ర‌క్ష‌ణ లేదంటున్న వ‌ర‌ల‌క్ష్మి!

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో కూతురుకైనా ర‌క్ష‌ణ లేద‌ని, చెప్పిన‌ట్టు  విన‌క‌పోతే లైంగిక వేధింపులు ఇక్క‌డ త‌ప్ప‌వ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ స‌మ‌యంలో అంతా ఇంటి ప‌ట్టునే వుంటున్నారు.

ఇలా ఇంటి ప‌ట్టున వున్న వాళ్ల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ఇళ్ల‌ల్లోనూ ర‌క్ష‌ణ లేద‌ని వ‌రల‌క్ష్మి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈ లాక్‌డౌన్ వేళ మ‌హిళ‌ల‌పై వేధిపులు అధికం అయ్యే ప్ర‌మాదం వుంద‌ని, నాలుగు గోడ‌ల మ‌ధ్య వారి ఆర్త‌నాదాలు బ‌య‌టికి వినిపించ‌వ‌ని, ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని వ‌ర‌ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఈ సంద‌ర్భంగా గృహ హింస‌కు గుర‌వుతున్న వారిని ర‌క్షించాంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా హెల్ప్ లైన్ నంబ‌ర్‌ని షేర్ చేశారు. `మ‌న చుట్టూ వున్న మ‌హిళ‌ల‌కు సాయం చేద్దాం. ఈ లాక్‌డౌన్‌లో వారిని గృహ హింస నుంచి కాపాడుదాం. ద‌య‌చేసి మీకు తెలిసిన మ‌హిళ‌ల‌కు 1800 102 7282 నంబ‌ర్‌ను షేర్ చేయండి. వేధించ‌డానికి వ‌య‌సు, ఆస్థి, స్థాయితో సంబంధం లేదు. ఎక్క‌డైనా ఆది జ‌ర‌గొచ్చు. అని వ‌ర‌ల‌క్ష్మి వెల్ల‌డించింది.