‘‘లక్షీస్ ఎన్టీఆర్’’ డిస్ట్రిబ్యూషన్ హక్కులపై పుకార్లు

Various News about Lakhsmis NTR Business are false,Movie Release on March 22nd – Makersసంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’బిజినెస్ గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో రేట్ కి కొన్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని ,ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జి.వి ఫిలింస్,రామ్ గోపాల్ వర్మ మరియురాకేష్ రెడ్డి లు త్వరలోనే తెలియజేస్తామన్నారు.

మార్చి 22న విడుదల.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు.ఇప్పటికే ట్రైలర్ ,ఓ సాంగ్ కి అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ థియేట్రికల్ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటికి పైగా మంది చూసారు..లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘‘నీ ఉనికి’’ అనేసాంగ్ ను కూడా 30 లక్షల మందికి పైగా చూశారు.. వీటన్నిటినీ చూస్తుంటే‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమా కు రేపు మార్చి 22న థియేటర్లలో జనాలుబ్రహ్మరథం పట్టడం ఖాయం. ఈ సంవత్సరంలో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా మారిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రం వేసవి కాలం పూర్తిగా రాకముందేఅందరిలో వేడి సెగలు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

టెక్నీషియన్స్-

ఎ జివి ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్,
దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
సినిమాటోగ్రఫీ : రమ్మీ
రచన : రాం గోపాల్ వర్మ & నరేంద్ర చారి
మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
ఎడిటర్ : కమల్ ఆర్
కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
లిరిక్స్ : సిరా శ్రీ
పి ఆర్ ఓ : జి.ఎస్.కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
సౌండ్ డిజైన్ : యతి రాజు

English Title: Various News about Lakhsmis NTR Business are false,Movie Release on
March 22nd – Makers