మేయ‌ర్‌ని చూసి ఆర్జీవీ వింత కోరిక‌!

మేయ‌ర్‌ని చూసి ఆర్జీవీ వింత కోరిక‌!
మేయ‌ర్‌ని చూసి ఆర్జీవీ వింత కోరిక‌!

నిత్యం ఏదో వివాదం కారణంగా వార్త‌ల్లో నిలుస్తూ వుంటారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. గ‌త కొంత కాలంగా ట్విట్ట‌ర్‌లో సైలెంట్‌గా వున్న వ‌ర్మ తాజాగా ఓ వీడియోని షేర్ చేసి త‌న‌కు మరో జ‌న్మ‌లో కుక్క‌లా వుట్టాల‌ని వుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ వార్త‌ల్లో నిల‌వాల‌ని ప్లాన్ చేసుకున్న వ‌ర్మ న‌గ‌ర మేయ‌ర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు.

ఆమె పంచుకున్న ఓ వీడియోని షేర్ చేసిన వ‌ర్మ కుక్క‌ల్ని ప్రేమించే మేయ‌ర్ ప్ర‌జ‌ల్ని కూడా కుక్క‌ల్లా ప్రేమిస్తుందా?  అంటూ కామెంట్ చేశాడు. అంతే కాకుండా త‌న‌కు వ‌చ్చే జ‌న్మంటూ వుంటే త‌న‌కు కుక్క‌లా పుట్టాల‌ని వుంద‌ని, ఈ మేయ‌ర్ ప్రేమ‌ని పొందాల‌ని సంచ‌ల‌న కామెంట్ చేశారు. తెరాస నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ మేయ‌ర్ పీఠాన్ని గ‌ద్వాల విజయ‌‌ల‌క్ష్మి ద‌క్కించుకున్నారు.

అయితే ఆమె త‌ను చ‌పాతీ తింటూ అదే చేత్తో త‌న పెంపుడు కుక్క‌ని బెడ్‌పై కూర్చోబెట్టి ప్రేమ‌గా తినిపిస్తున్న వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆ వీడియో వ‌ర్మ కంట‌ప‌డ‌టంతో దాన్ని చాలా తెలివిగా త‌న ప‌బ్లిసిటీకి వాడుకున్నారు. ఇంకే ముంది .. ఆ వీడియోని అడ్డుగా పెట్టుకుని మ‌రోసారి వ‌ర్మ వార్త‌ల్లో నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.