దిష్టి బొమ్మంటూ బాలయ్యపై వర్మ కామెంట్స్!దిష్టి బొమ్మంటూ బాలయ్యపై వర్మ కామెంట్స్!
దిష్టి బొమ్మంటూ బాలయ్యపై వర్మ కామెంట్స్!

సంచలన దర్శకుడు వర్మ మరోసారి తన నోటి దురుసుకు పదును పెట్టారు .. ఎప్పుడు మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసే అయన ఈ సారి నందమూరి అందగాడు బాలయ్యపై ఘాటు విమర్శలు చేసారు. నిన్న ఏపీ శాసన మండలి సమావేశంలో టిడిపి ఎం ఎల్ ఏ బాలకృష్ణ పక్కన వైసీపీ ఎం ఎల్ ఎల్ఏ రోజా కూర్చుని .. ఓ సెల్ఫీకి పోజిచ్చారు .. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అదిప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆ ఫోటోను వర్మ టాగ్ చేస్తూ .. పలు ఘాటు కామెంట్స్ చేసారు. ఎప్పుడు చంద్రబాబు పై విరుచుకుపడే రోజా బాలయ్య, చంద్రబాబు క‌నిపించేలా సెల్ఫీ తీసుకోవడం ఆసక్తి క‌రంగా మారింది.

ఆ ఫోటోపై వర్మ కామెంట్స్ చేస్తూ సెల్ఫీ లో రోజా ఓ హీరోలా కనిపిస్టోంద‌ని, ఆమె పక్కన ఎవరో కానీ అసహ్యంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలో రోజా అందాన్ని అతడు పాడుచేస్తున్నాడు .. నాకు తెలిసి రోజా కు అతడు దిష్టి బొమ్మ కావొచ్చు అంటూ ఘాటు కామెంట్‌లు చేసారు. అంతే కాదు మరో ట్విట్ చేస్తూ అందమైన రోజా పక్కన కూర్చొని ఆ ఫోటోని పాడు చేసిన వ్యక్తి ఎవరో చెప్పగలరా ? అంటూ మరో కామెంట్ పెట్టారు వర్మ. ప్రస్తుతం వర్మ పెట్టిన ట్విట్స్ వైరల్ గా మారాయి.

వ‌ర్మ ట్వీట్‌పై బాల‌య్య ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. బాలయ్య, రోజా కలిసి దాదాపు అరడజనుకుపైగా సినిమాల్లో నటించారు. అసలు త‌ను రాజకీయాల్లోకి రావడానికి కారణం బాలయ్యే అని చాలా సార్లు చెప్పింది రోజా. బాలయ్య సపోర్ట్ తో మొదట టిడిపిలో చేరి ఆ తరువాత పార్టీ మార్చేసింది. తాజా సెల్ఫీపై వ‌ర్మ చేసన కాంమెట్స్ మ‌ళ్లీ ఏ ర‌చ్చ‌కు దారితీస్తాయోన‌ని అంతా అనుకుంటున్నారు.

Credit: Twitter