పూరి కేవ్‌పై వ‌ర్మ కామెంట్‌!


Varma sensational comments on puri cave
Varma sensational comments on puri cave

వ‌రుస సినిమాల‌తో వివాదాలు సృష్టిస్తున్న రామ్‌గోపాల్‌వ‌ర్మ అంత‌కు మించి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల `బ్యూటిషుల్‌` సినిమా ప్ర‌మోష‌న్‌లో హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లు ప‌ట్టుకుని సంచ‌ల‌నం సృష్టించిన వ‌ర్మ ఈ మ‌ధ్య బాల‌య్య‌తో వైఎస్సార్సీపీ ఎంఎల్యే రోజా సెల్ఫీపై ఓ రేంజ్‌లో కామెంట్‌లు కురిపించి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ `కేవ్‌`పై వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

గ‌త కొన్నేళ్ల క్రితం త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టుగా 20 కోట్ల వ్య‌వ‌యంతో సొంత ఇంటిని నిర్మించుకుని దీనికి `కేవ్‌` అని పేరు పెట్టుకున్నారు. అప్ప‌ట్లో ఇది టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అలాంటి కేవ్‌పై వ‌ర్మ తాజాగా కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `ముంబైలో పూరి, చార్మిల ఆఫీస్ చూశాను. కేవ్‌కి ప‌దింత‌లు గొప్ప‌గా వుంది` అని వ‌ర్మ ట్వీట్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్‌` పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లే ముంబైలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న ఈ సినిమా కోసం పూరి ప్ర‌త్యేకంగా ఆఫీస్‌ని ఓపెన్ చేశారు. ఇందులో స‌క‌ల సౌక‌ర్యాల‌తో కావాల్సిన వ‌న్నీ వుండ‌టంతో వ‌ర్మ `వావ్ పూరి, చార్మీల ముంబై ఆఫీస్ సూప‌ర్ అంటూ ట్వీట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.